Last Updated:

Gali Janardhan Reddy: ఏ మాత్రం ఎఫెక్ట్ చూపని ‘గాలి’.. కుటుంబానికి షాక్

కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం.

Gali Janardhan Reddy: ఏ మాత్రం ఎఫెక్ట్ చూపని ‘గాలి’.. కుటుంబానికి షాక్

Gali Janardhan Reddy: కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరో వైపు భారతీయ జనతా పార్టీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.

 

కుటుంబానికి షాక్( Gali Janardhan Reddy)

తాజా కర్ణాటక ఎన్నికల రిజల్ట్ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి షాక్ నే మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో జనార్దనరెడ్డి మినహా పోటీలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు ఎవరూ విజయం సాధించలేక పోయారు. ఆయన సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకర్​రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేశారు. జనార్థన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ.. ఆయన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అభ్యర్థులుగా బరిలో నిలిచారు. బళ్లారి పట్టణ నియోజకవర్గంలో బీజేపీ తరపున గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి, కేఆర్‌పీపీ నుంచి భార్య లక్ష్మీ అరుణలను కాదని కాంగ్రెస్​ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి విజయం అందించారు. ఇక హరపనహళ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కరుణాకర్​రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి లతా మల్లిఖార్జున్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. మరో వైపు ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు కూడా కాంగ్రెస్ ​అభ్యర్థి నాగేంద్ర చేతిలో ఓడిపోయారు.

 

బోణీ కొట్టిన కేఆర్పీపీ

పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం. గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనార్థన రెడ్డి.. కాంగ్రెస్​ అభ్యర్థి ఇక్బాల్‌ అన్సారీపై గెలుపొందారు. బళ్లారి సిటీ నియోజకవర్గంలో తన సోదరుడు, బీజేపీ నేత సోమశేఖరెడ్డిపై.. కేఆర్​పీపీ అభ్యర్థిగా తన భార్య లక్ష్మీని పోటీకి దింపారు. అయితే ఇద్దరూ పరాజయం పాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌ రెడ్డి విజయం సాధించడం గమనార్హం.