K.A.Paul: కేఏ పాల్ ఎమోషనల్ వీడియో: మరుగుదొడ్డిలో జీవితం.. ఇదేనా బంగారు తెలంగాణ.. మీకేమో దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయమా?
కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
K.A.Paul: కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇక్కడ నిరుపేదలు ఉండడానికి నివాసం లేక బాధపడుతుంటే మీరేమో బీఆర్ఎస్ భవన్ లు కడుతున్నారా అంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులపై నిప్పులు చెరిగారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేఏ పాల్ ఫేస్ బుక్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలోని భారతమ్మ అనే మహిళ నివాసాన్ని పరిశీలించడానికి వెళ్లారు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చవిది ఆయన అక్కడకు వచ్చానని పేర్కొన్నారు. ఏవీ మీ డబుల్ బెడ్ రూం అని.. తెలంగాణ వచ్చి 9ఏళ్లు పూర్తయితే తెరాస ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టిందని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలను గాలికొదిలేసి మీరేమో దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ నిర్మిస్తారా.. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేశారని ఆయన వీడియో ద్వారా కేసీఆర్ ను ప్రశ్నించారు.
మీరు అభివృద్ధి చెయ్యరు.. నన్ను చెయ్యనియ్యరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబానికి 5 లక్షలు ఇస్తే అభివృద్ధి జరగదా.. నేను నా సొంత డబ్బుతో కొన్ని వందల ఇళ్లు కట్టించానని పేర్కొన్నారు. మీరు కట్టరూ నేను కడతా అంటే ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటారు అంటూ ఆయన అన్నారు. మునుగోడులో మొత్తం అభివృద్ధి 15 రోజుల్లో చేస్తా అన్నారు.. కనీసం రూ. 15 అయినా ఖర్చు పెట్టారా.. ఒక్క రోడ్డు అయినా వేశారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలారా గమనించండి ఏ అభివృద్ధి చెయ్యని వాళ్లు కావాలా లేక నేను కావాలా తేల్చుకోండి నాకు మద్దతు ఇవ్వండి అంటూ ఆయన వీడియో ద్వారా వేడుకున్నారు.
ఇదీ చదవండి: పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఎందుకు చెల్లలేదు?- తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇదీ..