Published On:

IPL 2025 : టాస్ గెలిచిన గిల్.. ఫస్ట్ బౌలింగ్

IPL 2025 : టాస్ గెలిచిన గిల్.. ఫస్ట్ బౌలింగ్

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

 

 

 

బెంగళూరు జట్టు : ఫిలిప్ స్టాల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భవనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.

గుజరాత్ జట్టు : సాయి సుదర్శన్, శుభమన్ గిల్, జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాస్ సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఉన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: