Published On:

Assembly Bypoll Result 2025: నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో భవితవ్యం

Assembly Bypoll Result 2025: నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో భవితవ్యం

Election Counting Assembly Bypoll Result 2025: దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జూన్ 19న మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉదయం 8 గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఐదు నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రారంభమవ్వగా.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు గుజరాత్ లో విసావదర్, కడి స్థానాలు.. పంజాబ్ లో లూథియానా.. పశ్చిమ బెంగాల్ లో కాళీగంజ్ స్థానం.. కేరళలోని నిలాంబూరు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామాతో పాటు కొంతమంది మరణించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

 

ఇందులో నిలంబూరు ఎమ్మెల్యే అన్వర్ రాజీనామా చేశారు. లూథియానాలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సి మృతి చెందాడు. అయితే నిలంబూరులో 75.27శాతం పోలవ్వగా.. లుథియానా వెస్ట్ లో 51.33 శాతం, కడీలో 57.91 శాతం, విసావదర్ లో 56.89 శాతం, కాళీగంజ్ లో 73.36 శాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి: