Maoists: పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టుతో సహా మరొకరి హత్య

Maoists: లొంగిపోయిన మావోయిస్టుతోపాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెండ్రబోర్, యమపూర్ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలను శనివారం రాత్రి సాయుధంగా వచ్చిన మావోయిస్టులు అపహరించారు. ఇద్దరినీ పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి దారుణంగా హత్య చేశారు.
సమాచారం చేరవేస్తున్నారనే..
సమ్మయ్య మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఇతడు ఇటీవల జన జీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి బీజాపూర్ పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సమ్మయ్య, దేవాలు మావోల పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని విపత్తు తోటి ఇద్దరిని నక్సలైట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పామేడు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. వారం రోజుల్లో మావోయిస్టులు ఇప్పటి వరకు ఐదుగురిని హత్య చేశారు.