Published On:

Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

Arrested for Sheltering Pakistani Terrorists: పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్‌ఐఏ ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌‌లుగా గుర్తించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించారు. దీంతోపాటు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉగ్రదాడి కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దాడికి ముందు హిల్ పార్కు ప్రాంతంలోని ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్‌ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్థానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

 

పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవల కాలంలో ఈ ప్రదేశంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. దీంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడుల్లో16 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: