Published On:

Kannappa: రిలీజ్ ముందర ట్రోలర్లకు దొరికిన మంచు విష్ణు..!

Kannappa: రిలీజ్ ముందర ట్రోలర్లకు దొరికిన మంచు విష్ణు..!

Kannappa: మంచు విష్ణు అంటేనే సోషల్ మీడియా ఊగిపోతుంది. ఆయన ఏం మాట్లాడినా వైరల్ వైరల్ వైరల్. అన్న నడిచొస్తే మాస్ అన్నట్లు విష్ణు మాట్లాడితే వైరల్. అంతే దానికి మరో పేరు లేదు బ్రో. అయితా తాజాగా మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన కన్నప్ప సినిమా రిలీజ్ కు దగ్గరైంది. ఇఫ్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఆ మరిచిపోయా… ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ లాంటి ప్రముఖ హీరోలు చెరో వేషం వేశారు. ట్రోలర్ల అంచనాలను తలకిందులు చేస్తూ కన్నప్ప ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది ట్రోలర్లకు విపరీతమైన షాక్. అందులోనుంచి తేరుకోవడానికి మంచు విష్ణు మరో బాంబు పేల్చాడు.

 

కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో మంచు విష్ణు బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్, విజయవాడల్లో ఘనంగా చేశారు. శ్రీకాళహస్తిలో కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తారని టాక్ ఉంది. అసలు విషయానికి వస్తే.. విష్ణు ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ… తాను హిందువునని చెప్పుకున్నాడు. తన భార్య క్రిస్టియన్ అని ఆవిడ రోజూ బైబిల్ చదువుతుందని తెలిపారు. అయితే రోజూ తాను నిద్రపోతున్నప్పుడు తల కింద బైబిల్ పెడుతుందని అన్నాడు. తనలో ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. కాకపోతే తాను గుడికి వెళ్తేనే ప్రశాంతత దొరుకుతుందని అన్నాడు విష్ణు.

 

ఈ విషయంపై ట్రోలర్లు విష్ణును ఆడేసుకుంటున్నారు. కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యేంతవరకు మాట్లాడకుండా ఉండలేవా అని అంటున్నారు. నిన్ను ఎవరు అడిగారు తల కింద ఏం పెట్టుకుంటావో అని ఆటపట్టిస్తున్నారు. అదలా ఉంచితే… కన్నప్ప క్లైమాక్స్ అందరికీ తెలిసిందేనని అన్నడు విష్ణు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రస్తుత జనరేషన్ కు అప్పటి కథను చూపెడుతున్నట్లు అది పరమేశ్వరుడి ఆశీర్వాదమేనని అన్నాడు.

 

భారీ బడ్జెట్ తో తీసిన కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు ముఖ్యపాత్రవేశారు. ఈ నెల 27న రిలీజ్ అవబోయే ఈ సినిమాకు అత్యంత అంచనాలు ఉన్నాయి. మంచువిష్ణును హీరోగా మరోసారి నిలబెట్టే సినిమాగా ప్రచారం సాగుతోంది. రిలీజ్ అయ్యేదాక వేచిచూద్దాం మరి.

 

 

ఇవి కూడా చదవండి: