Manchu Vishnu Vs Manchu Manoj: విష్ణు వర్సెస్ మనోజ్ – బాక్సాఫీసు వద్ద మంచు బ్రదర్స్ పోటీ! పై చేయి ఎవరిదో..

manchu vishnu kannappa and manchu manoj movie hits same day: కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటికి తండ్రికొడుకుల వ్యవహారంలా కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం మంచు బ్రదర్స్ నువ్వా-నేనా? అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయట. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అన్నదమ్ముల మధ్య చిచ్చు మొదలైంది. యూనివర్సిటీ విషయంలోనే ఈ వివాదం మొదలైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ కామెంట్స్ చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది.
పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంతలా..
ఏదేమైనా కుటుంబంలో మాత్రం అన్నదమ్ముల కలహాలు తారస్థాయిలో ఉన్నాయట. విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టుగా ఉంది వ్యవహారం.అయితే ఈ కుటుంబ వివాదాలు కాస్తా బాక్సాఫీసు వరకు చేరేలా ఉన్నాయి. ఈ మంచు బ్రదర్స్ ఇంట్లోనే కాదు బాక్సాఫీసు వద్ద కూడా పోటీ పడేనున్నారట. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. కొన్నెళ్లుగా మంచు బ్రదర్స్ నుంచి ఒక్క సినిమా లేదు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు కొనసాగిస్తున్నాడు. మనోజ్ విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలను పక్కన పెట్టాడు. విడాకులు, రెండో పెళ్లి గొడవలతోనే అతడి ఇన్నేళ్లు గడిచింది. ఇటీవల భూమ మౌనికని రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ మొదలుపెట్టాడు.
కన్నప్ప వర్సెస్ భైరవం
మరోవైపు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో వాట్ ద ఫిష్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. కానీ దీని నుంచి ఇంతవరకు ఒక్క అప్‌డేట్ లేదు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ శంకర్ కూతురు అదితి హీరోహీరోయిన్లుగా ‘భైరవం’ వస్తుంది. ఇందులో మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు విష్ణు లాంగ్ గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా జరుపుకుటుంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఏప్రీల్ 25న రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. ఆ తేదీకే వచ్చేందుకు ‘కన్నప్ప’ టీం కూడా సినిమాను రెడీ చేసే పనిలో ఉంది.
ఆ రోజే కన్నప్ప, భైరవం రిలీజ్?
నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తుంది. అయితే మనోజ్ కీలక పాత్రలో నటించిన భైరవం మూవీ కూడా అదే తేదీ వచ్చే అవకాశం ఉందట. నిజానికి భైరవం మూవీ కూడా గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయాల్సి ఉంది. షూటింగ్ ఆలస్యం వల్ల సినిమాను వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు భైరవం చిత్రాన్ని కూడా సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వారు కూడా కన్నప్ప రిలీజ్ డేట్ రోజనే అంటే ఏప్రీల్ 25నే మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇంట్లోనే కాకుండా బాక్సాఫీసు వద్ద ఈ మంచు బ్రదర్స్ పోటీ తప్పదు. ఒకవేళ్ల ఈ వార్తలే నిజమై భైరవం, కన్నప్పలు ఒకే రిలీజ్ అయితే మరి ఈ మంచు బ్రదర్స్‌లో ఎవరిది పై చేయి అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.