Published On:

Walking For Heart Patients: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ఇలా చేయాలి.!

Walking For Heart Patients: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ఇలా చేయాలి.!

Walking For Heart Patients:  మనుషుల జీవనానికి గుండె ముఖ్య పాత్రను పోషిస్తుంది. చెడు రక్తాన్ని సిరల ద్వారా తీసుకుంటూ మంచి రక్తంగా శుద్ది చేసి దమనుల ద్వారా విడుదల చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి, అందుకు నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక వలన కేవలం గుండెకు మాత్రమే కాకుండా శరీరానికంతటికి శక్తి లభిస్తుంది. ఇందుకు హెల్డీ డైట్ తో పాటు నడక చాలా అవసరం. ఒకప్పుడు మన తాతల కాలంలో ఏచిన్నపనికైనా నడిచే వెళ్లేవారు. ఇప్పుడు ఇంటిపక్కన కిరాణా షాపుకు వెళ్లాలన్నా వెహికిల్ తప్పనిసరిగా మారింది. శారీరక శ్రమను ఇప్పటి కాలం వాళ్లు అంతగా ఎంకరేజ్ చేయడం లేదు. అందుకు కారణం మారిన ఉద్యోగాల తీరు… ప్రస్తుతం ఉద్యోగాలు టార్గెట్ ఓరియంటెండ్ గా ఉన్నాయి. ఆఫీసులోనే చాలా అలిసిపోవడం వలన మరో శారీరక శ్రమపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపడం లేదు.

 

morning walking tips for heart patients in telugumorning walking tips for heart patients in telugu

morning walking tips for heart patients in telugu

 

 

శారీరక శ్రమ తగ్గడం వలనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులోనూ ఒకే దగ్గర అలాగే గంటల తరడబి కూర్చోవడం వలన రక్త నాలాల్లో ఫ్యాట్ పెరగడం గుండెకు సంబందించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తీసునే ఆహారం నుంచి తాగే నీరు వరకు అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంతో పాటు వర్కవుట్ ఎంతగానో ఉపయోగం. అందుకు వాకింగ్ చాలా సులభమైన పద్దతి. అయితే గుండె జబ్బులకు లోనైన వారు డాక్టర్ సలహాతో వాకింగ్ ఎంత ఫాస్ట్ గా చేయాలో తెలుసుకోవాలి. కష్టమైన వర్కవుట్లు కొంతమందికి సూట్ కావు. అయితే తేలికపాటి నడక మాత్రం అందరికి సరిపోతుంది. ఉదయం సాయంత్రం వేల వీలుచూసుకుని అరగంట తేలిక పాటి వాకింగ్ ను చేయవచ్చు. దీంతో గుండెకు కూడా సరైన వ్యాయామం, సరూన రక్త ప్రసరణ లభించే అవకాశం ఉంటుంది.

 

morning walking tips for heart  diseases

morning walking tips for heart diseases

 

 

గుండె జబ్బులతో బాధపడేవారికి డాక్టర్లు ఎక్కువగా వెయిట్ లిఫ్ చేయకూడదని సలహా ఇస్తుంటారు. అయితే సాధారణ వ్యాయామం చేయాలంటే నడక అన్నింటికన్నా ఉత్తమమైనది. హార్ట్ రేట్ సాధారణంగా ఉండాలన్నా నడక తప్పనిసరి. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరానికి ఫిట్ నెట్ పెరుగుతుంది. ఆక్సీజన్ సరైన మోతాదులో అందుతుంది. రెగ్యులర్ వాకింగ్ వలన కొలస్ట్రాల్ లెవల్స్ మారతాయి. బరువును సరిగ్గా మెయిన్టేన్ చేయడంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్ పెరగడం వలనే గుండె సమస్యలు వస్తాయి.

walking tips for heart patients in telugu

walking tips for heart patients in telugu

 

నడక వలన శరీరానికి లాభం చేకూరడంతో పాటు మానసికంగా కూడా హెల్దీగా తయారవుతారు. నడక ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. అలవాటు లేని వాళ్లు ఒకే సారి ఎక్కువగా వాకింగ్ చేయకూడదు. డాక్టర్ సలహాతో వాకింగ్ చేయాలి. ఎక్కువగా గుండె జబ్బులు ఉన్నవాళ్లు వాకింగ్ చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి, ఆయాసం, కళ్లు తిరగడం వంటివి అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి.

 

 

గమనిక.. పై చెప్పిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి ఏవిధంగాను మెడిసిన్ కు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు డాక్టర్ సలహాను తప్పక తీసుకోగలరు. ఖచ్చితమైన రిజల్ట్ కోసం చానల్ బాధ్యత వహించదు.

 

ఇవి కూడా చదవండి: