Ram Pothineni: తండేల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని.. అసలు నిజం ఇదే

Ram Pothineni: ఉస్తాద్ హీరో రామ్ పోతినేని వరుస పరాజయాల మధ్య నడుస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు విజయం దక్కింది లేదు. స్కంద అయినా హిట్ ఇస్తుంది అనుకుంటే అది వేరేలా మారింది. పోనీ రామ్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ హిట్ ఇస్తుంది అనుకుంటే.. అది మరీ దారుణంగా భారీ డిజాస్టర్ ను అందుకుంది.
అయినా రామ్ నిరాశపడకుండా కథలను ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ పోతినేని తన తదుపరి చిత్రం మైత్రీ మూవీస్ లో అనౌన్స్ చేశాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రం RAPO22. రామ్ సరసన ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ చిత్రంలో సాగర్ గా రామ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశాడు. ప్రస్తుతం RAPO22 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇక RAPO22 కాకుండా రామ్ మరో సినిమాను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తండేల్ సినిమాతో ఎప్పటినుంచో ప్లాపుల్లో ఉన్న అక్కినేని నాగచైతన్యకు భారీ విజయాన్ని అందించాడు డైరెక్టర్ చందూ మొండేటి. మొట్ట మొదటి సారి చై పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.
తండేల్ తరువాత కూడా చందూ మొండేటి గీతా ఆర్ట్స్ లోనే మరొక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ వివాదంలో అల్లు అరవింద్.. చందు మొండేటి తమ బ్యానర్ లోనే రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. అందులో ఒకటి తండేల్. ఇక రెండోది.. రామ్ తో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామ్ హీరోగా.. చందూ మొండేటి ఒక సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామ్ హీరోగా.. చందూ మొండేటి ఒక సినిమా చేస్తున్నాడని వస్తున్న వార్తలు అన్ని ఫేక్ అని తెలుస్తోంది. అసలు ఇలాంటి ఒక కాంబో ఇంకా సెట్ కాలేదని, అది గాలివార్త అని పలువురు చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే రామ్ – చందూ మంచి కాంబో అవుతుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.