Last Updated:

Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రోజు రోజుకూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో అవగాహన రావడం లేదు.

ఇవి కూడా చదవండి: