Last Updated:

Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని, మీకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించడం లేదని, స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కులానికి స్టేచర్ ఉండదని, ఒక్క పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, వ్యక్తికి కూడా కాదని తెలిపారు. ఇకపై ఫామ్‌హౌజ్‌ల్లో డ్రగ్స్ పార్టీలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

 

 

నిర్మాత కేదార్ మృతిపై ప్రస్తావన..
దుబాయ్‌లో ఏం జరిగిందో అన్ని వివరాలు తెప్పించామంటూ నిర్మాత కేదార్ మృతికి సంబంధించి సీఎం సభలో ప్రస్తావించారు. ఆ నాయకుడు సభకు వచ్చాక అన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లతోనే తాము ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని సీఎం ప్రశ్నించారు. మొదటి సంవత్సరంలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందని ఇటీవల వచ్చిన నివేదికలు చెబుతున్నాయని గుర్తుచేశారు. తెలంగాణలో విద్యా వవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. కేవలం తమ ప్రభుత్వం నిరుపేదల పిల్లల చదువుల కోసమే ఇవన్నీ చేస్తోందన్నారు. రూ.300 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.

 

 

మార్చురీలో బీఆర్ఎస్..
స్టేచర్‌పై ఉన్న ఆలోచన బీఆర్ఎస్‌ పార్టీకి స్టేట్ ఫ్యూచర్‌పై లేదన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు మార్చురీలో ఉన్న మాట వాస్తవమేనని, అందులో తప్పేముందని సమర్ధించుకన్నారు. తాను కేసీఆర్‌ను కించపరిచినట్లుగా కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్నారని, కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 15 నెలల్లో తాను 32 సార్లు ఢిల్లీకి వెళ్లానని, అవసరమైతే 300 సార్లు వెళ్తానని చెప్పారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించాలని, దేశ ప్రధాని ఏ రాష్ట్రానికికైనా పెద్దన్న లాంటివారేనని అన్నారు. అందులో రాజకీయం ఏముంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల్లా తాను చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకోలేదని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డుతో సహా అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చానని సీఎం రేవంత్ అన్నారు.

ఇవి కూడా చదవండి: