Last Updated:

Half Day Schools : ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Half Day Schools : ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Half Day Schools : రాష్ర్టంలో ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా ఒంటిపూట బడులపై ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది.

ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలకు ఒంటిపూట ఉంటుందని, వచ్చే నెల 23 వరకు బడులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాల్లో తరగతులు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు నడుస్తాయని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు తెలియజేశారు. దీంతో అమలును పాఠశాల ఎడ్యుకేషన్‌ డైరెక్ట్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: