Amrutha Pranay: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు – అమృత ఫస్ట్ రియాక్షన్ ఇదే!

Amrutha First Reaction on Court Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నల్గోండ కోర్టు తీర్పు వెలువరించింది. భర్త ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత ప్రణయ్ తొలిసారి స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇన్నాళ్ల నిరీక్షణకు న్యాయం జరిగిందని, ఇక ప్రశాంతంగా ప్రణయ్ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది.
ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించింది
“మా శ్రేయోభిలాషులకు.. ఇన్నాళ్ల నిరీక్షణకు న్యాయం జరిగింది. ప్రస్తుతం నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది.ఈ తీర్పుతో ఇకనైన పరువు పేరుతో జరిగే హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నాను. ఈ తీర్పులో ఇంతకాలంగా మాకు సపోర్టుగా నిలిచిన పోలీసు శాఖ, న్యాయవాదులు, మీడియాకు నా హృదయపూర్వక క్రతజ్ఞతలు. నా బిడ్డ పెరుగుతున్నాడు. అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యం దృష్ట్యా మీడియా ముందుకు కానీ, మీడియా సమావేశంకి కానీ రాలేకపోతున్నా. దయచేసి మా వ్యక్తిగత గొప్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే మా ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్‌కి మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రేమ, సపోర్టు లేకుండ ఇది జరిగేది కాదు. అందుకు మీ అందరికి ఎప్పడికి నేను కృతజ్ఞురాలిని. ప్రశాంతంగా ఉండు ప్రణయ్” అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘మర్డర్’ పేరుతో సినిమాగా
కాగా ఈ పరువు హత్య కేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కన్న తండ్రే తన భర్తను హత్య చేయించడంతో అమృత న్యాయపోరాటానికి దిగింది. కన్నతండ్రి అని కూడా ఆలోచించకుండ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేసింది. ఈ పరువు హత్య ఘటన ఆధారం ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘మర్డర్’ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే 2018లో నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి కత్తితో ప్రణయ్ మెడపై దాడి చేశాడు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
2018లో పరువు హత్య
అప్పటి నుంచి మృతుడి భార్య ప్రణిత న్యాయపోరాటం చేస్తోంది. చివరికి ఏడేళ్ల తర్వాత ఈ కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో A2 నిందితుడికి ఉరిశిక్ష విధించగా మరో ఆరుగురికి జీవితఖైతు విధిస్తూ ఎస్సీ,ఎస్టీ కేసులో విచారణ ప్రత్యేక న్యాయస్థానం రెండో అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుల శాఖ విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జీషీటు ఫైల్ చేసింది. దాదాపు ఐదేళ్లు పైగా కోర్టులో విచారణ సాగగా..ఇటీవల వాదనలు మగియడంతో సోమవారం (మార్చి 10) నల్గొండ కోర్టు తుదితీర్పు వెలువరిచింది.
View this post on Instagram