Last Updated:

US New Immigration Rules: ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. అమెరికాకు బైబై చెప్తారా?

US New Immigration Rules: ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. అమెరికాకు బైబై చెప్తారా?

America President Donald Trump New Immigration Rules For Visa’s: ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ అమెరికాలోని భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. డిపెండెంట్ వీసాపై ఉన్న వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్ కొత్త వలసవిధానంతో ఇప్పటికే గుర్తింపులేని కొంతమంది భారతీయులను ఇండియాకు పంపించినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లకే అసలు సమస్య తెస్తోంది. ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని గందర గోళంలో అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఉన్నారు. కొందరు కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు ఇండియా బాటపడుతున్నారు. అమెరికాకు పెండెంట్‌ వీసా కింద వెళ్లిన ఇండియన్స్ సుమారు లక్ష మందికిపైగా ఉన్నారని అంచనా. పాత ఇమ్మిగ్రేషన్ రూల్స్కి, కొత్తవాటికి తేడా ఏంటీ.. కొత్త రూల్స్తో అమెరికాలో ఉన్న ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం..

అమెరికాకి వెళ్లి చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని చాల మంది కళలు కంటుంటారు. అయితే ప్రస్తుతం సిన్ ఒకప్పటిలా లేదు పూర్తిగా మారిపోయింది. ఇందుకు ముఖ్యమైన కారణాలలో ఒకటి అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం. అవును.. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎన్నో విధానాల మార్పలు చేస్తు వస్తున్నారు. ఇవన్నీ మొత్తం ప్రపంచ దేశాలను కదిలించాయి. అలాగే అమెరికాలో ఉంటున్న విదేశీయులను పరుగులు పెట్టించాయి. అమెరికా నుండి భారతీయులను వేల సంఖ్యలో ఇంటికి పంపించేస్తున్నారు కూడా.

మరోవైపు రీసెంట్‌గా సోషల్ మీడియా సైట్ రెడిట్ లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ అందరిని ఆలోచించేలా చేస్తుంది. అతను చేసిన పోస్టులో, నేను గత 12 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడికి నేను మొదట ఎంఎస్ డిగ్రీ కోసం వచ్చాను. ప్రస్తుతం USలో ఫుల్ స్టాక్ సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా 2 యూనివర్సిటీస్లో 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా స్కిల్స్ పైథాన్, జాంగో జావాస్క్రిప్ట్, Vue.js, పోస్ట్‌గ్రెస్. నేను వెబ్ అప్లికేషన్లు, డేటా పైప్‌లైన్స్, డేటా విజువలైజేషన్లను మీద వర్క్ చేస్తున్నాను. అయితే నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉండటంతో నేను మే నెలలో ఇండియాకి వస్తున్నానని పోస్ట్ చేశారు. గత 6 నెలలుగా నేను ఇండియాలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశాను కానీ నాకు కేవలం 1 ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది అది కూడా చివరి నిమిషంలో రిజక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను కెరీర్ సలహాల కోసం చూస్తున్నాను. ఒకవైపు నా తల్లిదండ్రులను ఒంటరిగా వొదిలేయలేను అలాగే నాకు గ్రీన్ కార్డ్ రావడనికి మరో 15+ సంవత్సరాలు ఎదురు చూడాలి కాబట్టి నేను తిరిగి ఇండియాకి రావాల్సిందే. నేను క్లౌడ్ కంప్యూటింగ్ లేదా డాకర్, కుబెర్నెట్స్, మెసేజ్ క్యూలతో ఎప్పుడూ వర్క్ చేయలేదు. దాదాపు ప్రతి జాబ్ పోస్టింగ్‌లో ఈ టెక్నాలజీలు లిస్ట్ చేసి ఉండటం నేను చూసాను. భారతదేశంలోని చాలా మంది డెవలపర్‌లకి ఇప్పటికే ఈ స్కిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాలాంటి సీనియర్ డెవలపర్ ఇప్పటికే తెలుసుకోవలసిన కీలక టెక్నాలజిస్ తెలియకపోవడం నన్ను ఉపయోగం లేకుండా చేసిందని గ్రహించానని పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఇది నెట్టింట వైరలైంది. దీనికి కారణం ప్రస్తుతం అమెరికాలో వేగంగా మారుతున్న పరిణామాలే. మరోవైపు అమెరికాకు డిపెండెంట్‌ వీసాపై వెళ్లిన వేలాది మంది భవిష్యత్తు ట్రంప్‌ కఠిన వీసా నిబంధనలతో అగమ్యగోచరంగా మారింది. H-1B వీసాదారుల డిపెండెన్స్ కోసం జారీ చేసే H-4 వీసాపై వచ్చిన వేలాది మైనర్లకు 21 ఏళ్లు నిండుతుండటం వల్ల వారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్‌ చట్టాల ప్రకారం H-4 వీసాపై అమెరికాకు వచ్చి 21 ఏళ్ల నిండిన వారు డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోతారు. కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువును కూడా రద్దు చేశారు.

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వలసదారులను గుర్తించి సొంత దేశాలకు పంపించారు. కొందరు అక్కడి జైళ్లలోనే ఉన్నారు. ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ భారతీయులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే, అమెరికాలో నివాసం ఉంటున్న గుర్తింపు లేని భారతీయులను గుర్తించడంతో పాటు వారిని విడతలవారీగా స్వదేశాలకు పంపించారు. అయితే ఇప్పుడు సమస్య అంతా అక్కడున్న ఇండియన్స్ పరిస్థితి. మార్చి 2023 నాటికి దాదాపు 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు హెచ్4 వీసాపై అమెరికాలో ఉంటున్నారు. ఇందులో 21 ఇయర్స్ నిండిన వెంటనే డిపెండెంట్ వీసానుంచి గ్రీన్ కార్డుకు మారాల్సి ఉంటుంది. కాగా, పర్మినెంట్ నివాసం ఉండేలా చాలామంది భారతీయులు అక్కడే ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. కొన్ని దరఖాస్తులకు 12నుంచి 100 ఇయర్స్ పట్టే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే డిపెండెంట్ వీసా అర్హత కోల్పోయిన వారితో పాటు సరైన సర్టిఫికెట్స్ లేని యూత్‌కు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్(డీఏసీఏ) దేశ బహిష్కరణ నుంచి టెంపరరీ రెండేళ్ల ప్రొటెక్ట్ అందిస్తుంది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్‌ పర్మిట్‌ పొందలేరని టెక్సాస్‌లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వీసా గడువు ముగిసే వారు ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్‌షిప్‌ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతామనే ఆందోళన యువతలో నెలకొంది.

21 ఇయర్స్ నిండిన తర్వాత డిపెండెంట్ స్టేటస్ కోల్పోయే వారితో సహా, డాక్యుమెంట్లు లేని యువతకు బహిష్కరణ చేసే ఛాన్స్‌ నుంచి తాత్కాలికంగా రెండేళ్ల రక్షణ అమెరికా DACA అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు. దీంతో చాలా మంది భారతీయ యువత భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కెనడా లాంటి ఇతర దేశాల బాటపడుతున్నారు. మరికొందరు అన్ని సర్దుకుని ఇండియాకు పయనమవుతున్నారు. ఇదిలా ఉండగా, 2023 మార్చి వరకు దాదాపు 1.34 లక్షల మందికి వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు వచ్చేలోగా డిపెండెంట్ వీసా హోదా కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలో శాశ్వత పౌరసత్వం లభించడం కోసం దరఖాస్తు దారులకు 12 నుంచి 100 సంవత్సరాల సమయం పడుతోందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో వలసదారులు వీసా నిబంధనలు సరళంగా ఉన్న కెనడా, బ్రిటన్‌ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.