Last Updated:

Thandel OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘తండేల్‌’ – అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌!

Thandel OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘తండేల్‌’ – అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌!

Thandel OTT Streaming Details: మరికొన్ని గంటల్లో నాగ చైతన్య లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘తండేల్‌’ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. దేశభక్తి, ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన తండేల్‌ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీకి వచ్చేస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చినీ సినిమా ఇటూ యూత్‌ని అటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.

నాగ చైతన్య కెరీర్‌లో తండేల్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. థియేట్రికల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం తండేల్‌ డిజిటల్‌ రైట్స్‌ని సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ సినిమా మార్చి 7న ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ సినిమా ఈరోజు ఓటీటీలో రిలీజ్‌ కానుంది.  నేటి అర్థరాత్రి నుంచ తండేల్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.మరి ఇంకేందుకు ఆలస్యం మరోసారి తండేల్‌ను ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

కాగా శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది గుజరాత్ వెరావల్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో వారిని పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తోంది. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యలు, ఆ 22 మందిని బయటకు తీసుకురావడానికి రాజు ప్రియురాలు చేసిన పోరాటం నేపథ్యంలో తండేల్‌ కథ సాగుతుంది. ఈ సినిమా దేశభక్తిని కూడా జోడించడంతో మూవీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. నాగచైతన్య, సాయి పల్లవిలు జంటగా నటించిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మాత బన్నీవాసు నిర్మించారు.