MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు

Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరు నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. మరికొన్ని చోట్ల కూడా జనసేన కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే దువ్వాడపై రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు.