Published On:

Renuka Chowdhury: పుట్టినప్పుడే జగన్‌ గొంతు నొక్కాల్సింది.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka Chowdhury: పుట్టినప్పుడే జగన్‌ గొంతు నొక్కాల్సింది.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka Chowdhury Sensational Comments on YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టిందే దౌర్భాగ్యమని, జగన్ పుట్టిన రెండో నిమిషంలోనే తల్లి విజయమ్మ జగన్‌ది గొంతు నొక్కాల్సిందన్నారు. అప్పుడు విజయమ్మ ఆ పనిచేసింటే వాడి పీడ పోయిండేదని విరుచుకుపడ్డారు. జగన్ జీవితం ఏంటో బాగా తెలుసని విమర్శలు చేశారు.

 

అమరావతి రాజధానిపై ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సమాధానం ఇచ్చారు. జగన్ మహిళలపై వివక్ష ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇటీవల ఓ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో మహిళలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారన్నారు. నిజంగా ధైరముంటే అమరావతికి వచ్చి చూపించాలని సవాల్ విసిరారు.