Shweta Basu Prasad: ఆ తెలుగు హీరో వల్ల మూవీ సెట్లో చాలా ఇబ్బంది పడ్డాను – శ్వేతా బసు షాకింగ్ కామెంట్స్

Shweta Basu Comments on Telugu Hero: శ్వేత బసు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎక్కడా.. అంటూ తన క్యూట్ క్యూట్ డైలాగ్స్‌తో అబ్బాయి మనస్సులను దోచేసింది. అమాకమైన నవ్వుతో అబ్బాయిల కలల రాణిగా మారింది. ఫస్ట్ చిత్రంతోనే స్టార్ డమ్ అందుకుంది. ఈ చిత్రంతో ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న శ్వేత ఆ తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. అదే సమయంలో ఓ వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచింది.
అప్పటి నుంచి తెలుగు తెరపై ఆమె కనుమరుగైంది. ఆ మధ్య జీనియస్ అనే చిత్రంలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన 2018లో విజేత చిత్రంతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. కానీ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశపడ్డ ఆమెకు నిరాశే ఎదురైంది. టాలీవుడ్లో మంచి అవకాశం ఎదురూచూస్తోంది. అయితే బాలీవుడ్ మాత్రం అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ని నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో శ్వేత బస్సు ఊప్స్ అబ్ క్యా(Oops Ab Kya) అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. ఫిబ్రవరి 20న జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్లమీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది.
హీరోతో ఇబ్బంది పడ్డా..
ఈ సందర్భంగా శ్వేత తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి ప్రస్తావించింది. తను నటించి ఓ సినిమా సెట్లో చాలా ఇబ్బంది పడ్డానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “చాలా ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఆఫర్స్‌తో నా కెరీర్ బాగానే సాగుతుంది. కానీ, ఓ సినిమా సెట్లో జరిగిన సంఘటనలు నేను ఎప్పటికి మర్చిపోను. ఓ తెలుగు సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరో వల్ల సెట్లో చాలా ఇబ్బంది పడ్డాను. నా హైట్ 5’2, ఆ హీరో సుమారు ఆరడగులు ఉంటాడు. దీంతో అందరు హీరో హైట్‌తో పోలుస్తూ నాది తక్కువ హైట్ అని హేళన చేసేవాళ్లు.
సెట్లో అంతా నా గురించే..
ఆ హీరో కూడా కొన్నిసార్లు నా హైట్ వ్యంగ్యంగా మాట్లాడేవారని తెలిసింది. ప్రతి రోజు సెట్లో నా ఎత్తు గురించి ప్రస్తావిస్తూ హేళన చేసేవాళ్లు. దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ హీరో మరో సమస్య కూడా ఉండేది. షూటింగ్ జరుగుతున్నప్పుడు సీన్‌ని గందరగోళం చేసేవాడు. ఒక్క సీన్ చేయడానికి ఎన్నో రీ టేకులు తీసుకునేవాడు. తెలుగువాడే అయినా అతడికి తెలుగు భాష సరిగ్గా రాదు. దీంతో డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడేవాడు. అతడి మాటలు సెట్స్‌లో ఎవరికీ అర్థమయ్యేవి కావు. నేను తెలుగు అమ్మాయిని కాకపోయినా కష్టపడి భాష నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదాన్ని.
అయినా కూడా చాలా మంది నా హైట్ గురించే కామెంట్స్ చేసేవాళ్లు. ఆ హీరో తెలుగు సరిగా మాట్లాడకపోయేవాడు. ఎన్నో సార్లు రీటేక్స్ తీసుకునేవాడు. కానీ, అతడి ఏం అనేవారు కాదు. కానీ నా కంట్రోల్లో లేని నా హైట్ గురించి మాత్రం తరచూ ప్రస్తావిస్తూ హేళన చేస్తుండేవారు. అది నాకు చాలా బాధగా అనిపించేది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్వేతా బస్సు కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఇంటర్య్వూలో ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో శ్వేత బస్సు ఏ హీరో గురించి చెప్పిందా? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. కాగా కొత్త బంగారు లోకం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఆ తర్వాత రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.