Last Updated:

Delhi Election Results 2025: ఢిల్లీలో బీజేపీ హవా.. సీఎం ఓమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్

Delhi Election Results 2025: ఢిల్లీలో బీజేపీ హవా.. సీఎం ఓమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్

CM Omar Abdullah Intresting Comments about Delhi Election Results 2025: ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ పార్టీ కూడా వెనుకంజలో కొనసాగుతోంది. ఈ INDIAరెండు పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఇండీ కూటమిపై విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

‘ జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని ఆ జిఫ్‌లో ఉంది. ఇండీ కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇండీ కూటమిలోని గొడవలు ఎక్కువయ్యాయని, అందుకే ఫలితాలు దారుణంగా వస్తున్నాయని అర్ధం వచ్చేలా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ట్వీట్ చేశారు.