Vivo X200 Ultra Launch: యాహూ.. అద్భుతమైన ఫీచర్లతో వివో ఎక్స్200 అల్ట్రా.. 200MP కెమెరా.. మరెన్నో.. లాంచ్ ఎప్పుడంటే?

Vivo X200 Ultra Launching on 21st April 2025: చైనీస్ టెక్ మేకర్ వివో మొబైల్ ప్రియులకు శుభవార్త చెప్పింది. “Vivo X200 Ultra” త్వరలో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ఓ టెక్ వీరుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు. ఆ సమాచారం ప్రకారం Vivo X200 Ultra ఏప్రిల్ 21న చైనాలో లాంచ్ కానుంది. అంతే కాకుండా వివో ఈ రాబోయే ఫోన్ హ్యాండ్-ఆన్ వీడియో కూడా లీక్ అయింది. ఈ వీడియోలను కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Vivo X200 Ultra Features..
వీడియో చూస్తుంటే Vivo X200 Ultra లుక్ చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. హ్యాండ్ ఆన్ వీడియో ప్రకారం.. ఈ వివో ఫోన్ పెద్ద వెనుక కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఇందులో మీరు 1/1.28 అంగుళాల నుండి 1/1.4 అంగుళాల వరకు సెన్సార్లను పొందచ్చు. ఇది కాకుండా, కంపెనీ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను కూడా అందించనుంది. ఫోన్ డిస్‌ప్లే క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌లో ఉంటుంది. అలానే ఫోన్ కుడి వైపున కొత్త కెమెరా బటన్ కూడా ఉంటుంది.
కంపెనీ ఈ ఫోన్ 6.82 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ BOE LTPO డిస్ప్లేతో రావచ్చు. 2K రిజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz కావచ్చు. కంపెనీ ఫోన్‌లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అందించబోతోంది. ఈ మొబైల్‌లో బ్యాటరీ 6000mAh కంటే ఎక్కువగా ఉంటుంది, ఇది 90 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ IP68/69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, మీరు ఫోన్‌లో అల్ట్రా-సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడచ్చు. కంపెనీ Vivo Pad 5 Pro, Pad SE, Watch 5 లను కూడా ఏప్రిల్ 21 న విడుదల చేయబోతోంది.
Vivo X200 Ultra Launch Date..
టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. Vivo X200s కూడా ఏప్రిల్ 21 న విడుదల కానుంది. ఈ ఫోన్ కొత్త లావెండర్, మింట్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్ ఎంపికలలో వస్తుంది. కంపెనీ ఫోన్‌లో 6.6-అంగుళాల 1.5K BOE Q10 అమోలెడ్ డిస్‌ప్లేను అందించగలదు. డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఫోన్‌లో మూడు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలను అందించబోతోంది. ఈ ఫోన్ బ్యాటరీ 6000mAh కంటే ఎక్కువగా ఉంటుంది, ఇది 90 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Fake Mobile Charger App: ఈ యాప్ చాలు.. మీ మొబైల్ ఛార్జర్ నకిలీదా..? ఒరిజినలా..? ఇట్టే తెలుసుకోవచ్చ!