Nothing Phone 3a Series: ట్రెండింగ్.. నథింగ్ ఫోన్ 3a లైనప్‌లో కొత్త ఫోన్లు.. ఫీచర్స్ చూస్తే తట్టుకోలేరు..!

Nothing Phone 3a Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ తన కొత్త సిరీస్ నథింగ్ ఫోన్ 3a లైనప్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ సిరీస్ ఫోన్లు మార్చి 4న విడుదల కానున్నాయి. ఇందులో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి.’ నథింగ్ ఫోన్ 3a , నథింగ్ ఫోన్ 3a ప్రో. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ తాజా నివేదిక రెండు మోడళ్ల కీలకమైన స్పెసిఫికేషన్‌లు, డిజైన్ వివరాలు, అంచనా వేసిన ధరలను వెల్లడించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Nothing Phone 3a, Phone 3a Pro Specifications
నథింగ్ ఫోన్ 3a లైనప్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో 6.77-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే పాండా గ్లాస్ ప్రొటక్షన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతాయి. దీనితో పాటు నథింగ్ ఫోన్ 3aలో 128GB స్టోరేజ్, 12GB ర్యామ్‌తో 256GB స్టోరేజ్ కలిగిన రెండు స్టోరేజ్ వేరియంట్‌లు, నథింగ్ ఫోన్ 3a ప్రోలో ఒకే 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటాయి.
నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో రెండూ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అయితే, ప్రో మోడల్‌లో సుపీరియర్ 3x ఆప్టికల్ జూమ్, 60x డిజిటల్ జూమ్ ఉంటాయి. అయితే స్టాండర్డ్ 3a 2x ఆప్టికల్, 30x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాలు కూడా విభిన్నంగా ఉంటాయి, 3aలో 32-మెగాపిక్సెల్ సెన్సార్, 3a ప్రోలో మెరుగైన సెల్ఫీల కోసం హై-రిజల్యూషన్ 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి.
Nothing Phone 3a, Phone 3a Pro Price
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 3a 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 349 (సుమారు రూ. 31,600), అయితే 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర EUR 399 (సుమారు రూ. 36,100) కావచ్చు. 3a ప్రో దాని ఏకైక కాన్ఫిగరేషన్ ధర EUR 479 (సుమారు రూ. 43,400) ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.