OPPO A5x Launch: వారెవ్వా.. ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్

OPPO A5x Launching Soon in India: ఒప్పో కంపెనీ త్వరలో తన ‘A’ సిరీస్‌కి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ పేరు OPPO A5x అని వెల్లడించారు, ఇది తక్కువ బడ్జెట్ విభాగంలో రానుంది. ఇప్పుడు కొత్త లీక్‌లో, ఈ చౌకైన ఒప్పో మొబైల్ ఫోన్ ఫోటో, స్పెసిఫికేషన్లు, ధర కూడా ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. నిజానికి, ఈ ఫోన్ మార్కెటింగ్ పోస్టర్ ఇంటర్నెట్లో షేర్ చేశారు. దీనిలో ఫోన్ వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OPPO A5x Price Leak
లీక్ ప్రకారం, Oppo A5X స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర Tk 13,990 (సుమారు రూ. 9,000), ఇది 4GB + 64GB వేరియంట్‌కు ఉంటుంది. 4GB + 128GB వేరియంట్ ధర 16,990 టాకా (సుమారు రూ. 11,000) గా ఉంటుంది. ఈ ఫోన్ మొదట బంగ్లాదేశ్‌లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత భారతదేశంతో సహా ఇతర దేశాల్లో విడుదల చేస్తారు.
OPPO A5x Specifications
లీక్స్ ప్రకారం.. OPPO A5x 6.67-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్,1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీని ముందు ప్యానెల్ ఫ్లాట్ డిజైన్ ఉంటుంది. అయితే ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ మిడ్నైట్ బ్లూ, లేజర్ వైట్‌లో వస్తుంది.
OPPO A5x Camera
ఫోన్ కెమెరా విభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడచ్చు, దీనిలో 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెకండరీ లెన్స్ ఉంటాయి. అదే సమయంలో ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించవచ్చని భావిస్తున్నారు. ఈ కెమెరా సెటప్ బేసిక్ ఫోటోగ్రఫీ, వీడియో కాలింగ్ కోసం బాగానే ఉంటుంది.
OPPO A5x Processor
ప్రాసెసింగ్ కోసం, OPPO A5xలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4G మొబైల్ చిప్సెట్. ఈ ఫోన్లో 4జీబీ ర్యామ్, 64జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో రావచ్చు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, ColorOS 15 ఆధారంగా ఆండ్రాయిడ్ OS ఇందులో కనిపిస్తుంది.
OPPO A5x Battery
లీకైన నివేదికల ప్రకారం.. ఈ ఫోన్లో 6,000 mAh పెద్ద బ్యాటరీని అందించవచ్చు, ఇది 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు పూర్తి బ్యాకప్ ఇవ్వగలదు. ఇతర ఫీచర్స్‌లో IP65 వాటర్, డస్ట్ ప్రూఫ్, మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రొటెక్షన్, IR రిమోట్ కంట్రోల్, అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి అనేక ఫీచర్స్ ఉంటాయి.