Home / టెక్నాలజీ
ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్‌ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్‌ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇష్టపడే వాల్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’ మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఈ స్కూటర్ ను 2021 ఆగష్టలోనే ఆవిష్కరించింది.
ట్విటర్ ను కొన్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్‌లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలుదారులకు అందించే సబ్సిడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సీఎన్జీ వెర్షన్లో తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ పేరుతో రిలీజ్ అయిన ఈ కారు..
జీతాలపెంపు విషయంలో మైక్రో సాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్టోఫర్ ఓ ఇంటర్నట్ లేఖ రాసినట్టు సమాచారం. జీతాల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కారణాలను వివరిస్తూ..
ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్ రానున్నటు తెలుస్తోంది.
2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఫ్యాక్టరీలో దాదాపు 20 వేల వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే వారం వార్షిక సరఫరాదారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది.
చైనాకు చెందిన యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో కొత్త గేమ్‌ను పరిచయం చేసింది.
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.