Home / టెక్నాలజీ
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు, నవంబర్ 21 వరకు కంపెనీ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడినందునట్విట్టర్ మునిగిపోయే నౌకగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
శుక్రవారం జారీ చేసిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం జరిమానా మొత్తాన్ని రూ.500 కోట్ల వరకు పెంచింది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది.
ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపింది.
ఎలోన్ మస్క్ ట్విట్టర్లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడంనుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు.
దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.
ఎలన్ మస్క్ ట్విటర్లోని అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా తీసుకొచ్చిన సంగితి తెలిసిందే. దీనికోసం ఈ బ్లూ టిక్కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే తాజాగా ఇలా చెయ్యండం వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కన్పించట్లేదని యూజర్లు అంటున్నారు.
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్వట్టర్ ఉద్యోగులతో మాట్లాడుతూ సంస్ద దివాలా తీయడాన్ని తోసిపుచ్చలేనని చెప్పారు.