Motorola Edge 40: మార్కెట్ లోకి ‘మోటోరోలా ఎడ్జ్ 40’ .. ధర ఎంతంటే?
ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్‌ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్‌ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
Motorola Edge 40: ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్‌ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్‌ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
ఎడ్జ్40 ధర ఎలా ఉందంటే
ఇంతకుముందు వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగానే ఈ ఎడ్జ్ 40 ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే దేశీయ మర్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరను రూ. 29,999 గా కంపెనీ నిర్ణయించింది. మే 23 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలు కాగా, మే 30 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. ఎక్లిప్స్ బ్లాక్, ల్యూనార్ బ్లూ, నెబ్యులా గ్రీన్ లాంటి 3 రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.
ఎడ్జ్ 40 స్పెసిఫికేషన్లు(Motorola Edge 40)
144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 6.5 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్ తో ఈ ఫోన్ వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 5జీ ప్రాసెసర్ ఉంది. డ్యుయల్ సిమ్ ఆప్షన్‌తో రాగా.. e SIM ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను ఇందులో ఇస్తున్నారు. రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వెనుక భాగంలో 50 MP,ముందు 32 MP కెమెరాను ఇస్తున్నారు. 68 Wat టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 4,400 mAh బ్యాటరీ ఇచ్చింది కంపెనీ. వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.