Last Updated:

Suzuki: సుజుకీ మోటార్ ఇండియాపై సైబర్ అటాక్.. నిలిచిపోయిన ప్రొడక్షన్

2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఫ్యాక్టరీలో దాదాపు 20 వేల వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే వారం వార్షిక సరఫరాదారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది.

Suzuki: సుజుకీ మోటార్ ఇండియాపై సైబర్ అటాక్.. నిలిచిపోయిన ప్రొడక్షన్

Suzuki: ప్రముఖ దేశీయ టూ వీలర్ వాహనతయారీ సంస్థ ‘సుజుకి మోటార్ ఇండియా’సైబర్ అటాక్ కు గురైంది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. సైబర్ దాడుల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయినట్టు కంపెనీ ప్రకటించింది.

నిలిచిన 20వేల వాహనాల ఉత్పత్తి(Suzuki)

2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఫ్యాక్టరీలో దాదాపు 20 వేల వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే వారం వార్షిక సరఫరాదారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది.

ఈ విషయంపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రతినిధి స్పందించారు. సైబర్ అటాక్ గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి తెలిపామన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయానికి సంబంధించిన వివరాలు మరింత అందించలేమని అన్నారు. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభనుందో అనే విషయం కూడా కంపెనీ ప్రస్తావించలేదు.

గ్లోబల్ అవుట్‌పుట్‌లో 50% వాటా

దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా సుజుకి మోటార్‌ సైకిల్ కు పేరుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అదే విధంగా కంపెనీకి భారత్ తో పాటు జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్‌పుట్‌లో 50% వాటాను భారత్ కలిగి ఉంది. అంతే కాకుండా సుజుకీ గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది.