Last Updated:

Microsoft: జీతాలు పెరగకపోయినా.. మీ ఆదాయాన్ని ఇలా పెంచుకోండి: మైక్రోసాఫ్ట్ సీఎంఓ

జీతాలపెంపు విషయంలో మైక్రో సాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ క్రిస్టోఫర్‌ ఓ ఇంటర్నట్ లేఖ రాసినట్టు సమాచారం. జీతాల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కారణాలను వివరిస్తూ..

Microsoft: జీతాలు పెరగకపోయినా.. మీ ఆదాయాన్ని ఇలా పెంచుకోండి: మైక్రోసాఫ్ట్ సీఎంఓ

Microsoft: ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిక టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్..ఈ ఏడాది ఫుల్ టైం శాశ్వతం ఉద్యోగులకు వేతనాల పెంపులు లేవని ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. అయితే, కంపెనీ జీతాలు పెంచకపోయినా.. ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని చీఫ్ మర్కెటింగ్ ఆఫీసర్ ఓ సూచన చేశారు.

స్టాక్‌ ధర పెరిగితే.. ఆటోమేటిక్‌గా(Microsoft)

జీతాలపెంపు విషయంలో మైక్రో సాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ క్రిస్టోఫర్‌ ఓ ఇంటర్నట్ లేఖ రాసినట్టు సమాచారం. జీతాల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కారణాలను వివరిస్తూ.. ఆదాయం పెంచుకునే మార్గాన్ని లేఖలో సూచించారు. ఒక వేళ కంపెనీ స్టాక్‌ ధర పెరిగితే.. ఆటోమేటిక్‌గా ఉద్యోగులకు అందే పరిహారం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ స్టాక్‌ ధర పెరిగేలా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలను నమోదు చేస్తే.. స్టాక్‌ ధర ఆకర్షణీయంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 33 శాతం పెరిగినట్లు క్రిస్టోఫర్‌ తన లేఖలో గుర్తు చేశారు.

ఆర్థికంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులకు బోనస్‌లు, స్టాక్‌ అవార్డులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. మరో వైపు ఈ ఏడాది జనవరిలో 10వేల మందిని తీసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.