iPhone 16 Price Drop: చాలా చీప్ గురూ.. ఐఫోన్ 16పై రూ.12 వేలు డిస్కౌంట్.. సమయం లేదు మిత్రమా..!

iPhone 16 Price Drop: ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుంది. దీని గురించి ప్రతిరోజూ ఏదో ఒక లీక్ నివేదిక బయటకు వస్తోంది. ఇటీవల ఈ సిరీస్ రెండర్‌లు, డమ్మీ యూనిట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వెల్లడయ్యాయి. యాపిల్ ఈ ఐఫోన్ సిరీస్ లాంచ్ కాకముందే, గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16 ధర బాగా తగ్గింది. ఈ ఐఫోన్‌ను వేల రూపాయల తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. అయితే ఈ ఆఫర్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండదు. విజయ్ సేల్స్‌లో జరుగుతున్న సేల్‌లో ఐఫోన్ 16 కొనుగోలు చేయడం ద్వారా మీరు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
iPhone 16 Offers
గత సంవత్సరం ప్రారంభించిన ఐఫోన్ 16, కొత్తగా రూపొందించిన కెమెరా మాడ్యూల్, యాక్షన్ బటన్, 512GB వరకు స్టోరేజ్ వంటి అనేక బలమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.79,900. ఈ ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ.71,990కి జాబితా చేశారు. ఇది కాకుండా, రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ విధంగా, ఫోన్ కొనుగోలుపై రూ.12,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ ఐఫోన్‌ను రూ. 67,990 ప్రారంభ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. దీనితో పాటు, మీరు ఈ ఐఫోన్‌ను రూ. 3179 ప్రారంభ EMIకి దక్కించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, దీని కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌కు బదులుగా ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తుంది.
iPhone 16 Features
యాపిల్ నుండి వచ్చిన ఈ ఐఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఇన్-హౌస్ A18 బయోనిక్ చిప్‌సెట్. ఈ ఫోన్‌లో 6GB RAM తో పాటు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందలె 48MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా ఉంది. ఇందులో కెమెరా కోసం ఒక ప్రత్యేకమైన యాక్షన్ బటన్ ఉంటుంది. అలాగే, ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ అంటే AI ఫీచర్‌తో అమర్చబడి ఉంది.