Motorola Edge 50 Fusion: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. మోటో ఫోన్ ధరను భారీగా తగ్గించేశారు.. చీప్‌గా కొనేయండి..!

Motorola Edge 50 Fusion: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేల్ తీసుకొచ్చింది. సేవింగ్స్ సేల్ పేరుతో ఈ సేల్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ జూల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ సేవింగ్స్ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు చాలా చౌకగా కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌పై చాలా గొప్ప డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని, మీరు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు.
Motorola Edge 50 Fusion Offers
8 GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27999గా ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి 25 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. డిస్కౌంట్ తర్వాత, మీరు రూ. 20999 ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయచ్చు. బ్యాంక్ ఆఫర్ల గురించి చెప్పాలంటే, మీకు యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 1000 డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కూడా క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. దీనితో పాటు, రూ. 20,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌తో మీకు రూ. 3500 నో-కాస్ట్ EMI ఆప్షన్ లభిస్తుంది.
Motorola Edge 50 Fusion Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz మద్దతు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ 1600 నిట్స్. అలానే ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది. అదే సమయంలో ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.
దీని కెమెరా ఫీచర్ల గురించి చెప్పాలంటే, దీని వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో మొదటి కెమెరా 50మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అంతేకాకుండా ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ IP68 రెసిస్టెర్స్‌తో కూడా వస్తుంది, ఇది దుమ్ము, నీటి నుండి రక్షిస్తుంది.