Last Updated:

Xiaomi 15 Ultra: ఇది కెమెరా కింగ్.. షియోమి 15 అల్ట్రా లాంచ్.. మార్చి 2న మంటలే..!

Xiaomi 15 Ultra: ఇది కెమెరా కింగ్.. షియోమి 15 అల్ట్రా లాంచ్.. మార్చి 2న మంటలే..!

Xiaomi 15 Ultra: ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Xiaomi 15 Ultra’ మొబైల్ లాంచ్ అయింది. కంపెనీ దీనిని అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంది. షియోమి మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం షియోమి 15 అల్ట్రా ఫోన్ చైనాలో లాంచ్ అయింది. మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఫోన్ భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని షియోమి ఇప్పటికే ధృవీకరించింది. షియోమి 15 అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Xiaomi 15 Ultra Highlights
మీరు ఉత్తమ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే సామ్‌సంగ్, వివో, యాపిల్‌తో సహా అనేక కంపెనీ పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ,షియోమి తన కొత్త శక్తివంతమైన అల్ట్రా ఫోన్‌తో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. కంపెనీ గత సంవత్సరం షియోమి 14 అల్ట్రా ఫోన్‌కు సక్సెసర్‌గా 15 అల్ట్రాను పరిచయం చేసింది. 200 మెగాపిక్సెల్ కెమెరా, 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబీ ర్యామ్ సహా ఎన్నో అద్భుతమైన క్వాలిటీ ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది.

Xiaomi 15 Ultra Features And Specifications
షియోమి 15 అల్ట్రా మొబైల్‌లో 6.73-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 3100 x 1440 పిక్సెల్‌ల రిజల్యూషన్, ​​120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ బెజెల్స్ మునుపటి మోడల్ కంటే కొంచెం సన్నగా ఉంటాయి.

Xiaomi 15 Ultra Processor
ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్‌లో డ్యూయల్ ఛానెల్ ఐస్ లూప్ డి కూలింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశారు. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS 2.0 పై రన్ అవుతుంది. ఈ మొబైల్‌కి 4 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ శక్తివంతమైన ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ, 1TB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

Xiaomi 15 Ultra Camera
షియోమి 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 200-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ HP9 పెరిస్కోప్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Xiaomi 15 Ultra Battery
కొత్త షియోమి 15 అల్ట్రా మొబైల్‌లో 6,000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఉంది. ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో 5400mAh బ్యాటరీతో విడుదల కానుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్,80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో USB 3.2 Gen 2 పోర్ట్, IP68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 7i ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, శాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్నాయి.

Xiaomi 15 Ultra Price
షియోమి 15 అల్ట్రా ఫోన్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.78,050, 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 84,050, 16GB + 1TB స్టోరేజ్ మోడల్ ధర రూ. 93,655, 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ (డ్యూయల్ శాటిలైట్ వెర్షన్) ధర రూ.96,045గా ఉంది. ఈ మొబైల్ క్లాసిక్ బ్లాక్, సిల్వర్, పైన్,సైప్రస్ గ్రీన్, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫోన్ భారతదేశంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో మార్చి 2న విడుదవుతుంది.