Lava Bold 5G: ఫోన్ అంటే ఇట్లుండాలి.. AI కెమెరాతో స్వదేశీ లావా 5G ఫోన్.. చైనా ఫోన్లు జుజుబీ..!

Lava Bold 5G: లావా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ “Lava Bold 5G”ని భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్ IP64-రేటెడ్ బిల్డ్, 64-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌తో వస్తుంది. అలానే ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. లావా బోల్డ్ 5G వచ్చే వారం అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Lava Bold 5G Price
Lava Bold 5G ప్రారంభ ధర రూ.10,499. ఇది 4జీబీ + 128జీబీ, 6జీబీ + 128జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. సఫైర్ బ్లూ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో విక్రయానికి వస్తుంది.
Lava Bold 5G Features And Specifications
Lava Bold 5G ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 అప్‌గ్రేడ్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. మొబైల్‌లో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అంతేకాకుండా ర్యామ్‌ని వర్చువల్‌గా 8జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో సోనీ సెన్సార్‌తో AI సపోర్ట్ 64-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ అందించారు.
Lava Shark
లావా షార్క్ ఫోన్‌ను కూడా గత నెల చివర్లో భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ AI-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇందులో యూనిసాక్ T606 చిప్‌సెట్ ఉంది. 8జీబీ వరకు ర్యామ్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. 5,000mAh బ్యాటరీ అందించారుర. AI ఇమేజింగ్ ఫీచర్‌లు, ఫేస్ అన్‌లాక్,సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
లావా షార్క్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా దేశంలో విక్రయానికి అందుబాటులో ఉంది. భారతదేశంలో లావా షార్క్ ధర రూ. 6,999గా నిర్ణయించారు. లావా వినియోగదారులకు 1 సంవత్సరం వారంటీ, ఇంటి వద్ద ఉచిత సర్వీస్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం లావా రిటైల్ స్టోర్ల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. స్టీల్త్ బ్లాక్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Vivo V50e Launch Date In India: రెడీగా ఉండండి.. ఖతర్నాక్ కెమెరాతో Vivo V50e వచ్చేస్తుందోచ్.. కలర్ ఆప్షన్లు కెవ్ కేక..!