Home / tirupathi
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
మాండూస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంత వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. కాగా నేడు మాండూస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంతో చిక్కుకుని ఉన్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. చాలా మంది లోతట్టు ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పవిత్ర పెరటాశి మాసం పురస్కరించుకొని తితిదే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీ మేర క్యూలైన్లలో వేచివున్నారు
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. శోభయామానంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగుతూ స్వామి వారు భక్తులకు కనువిందు చేసారు
తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు
అగ్నిప్రమాదం ఆ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుని వైద్యునితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో కోటిన్నర రూపాయలను స్వాహా చేసిన్నట్లు పోలీసులు తేల్చారు