Last Updated:

Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రౌండ్ మ్యాప్ వైరల్.. అంతా రామరాజ్యంలాగానే..!

Adipurush Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రౌండ్ మ్యాప్ వైరల్.. అంతా రామరాజ్యంలాగానే..!

Adipurush Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దాని కోసం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానం సుందరంగా ముస్తాబయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎన్నడూ చూడని విధంగా ఎప్పడూ జరగని విధంగా భారీగా, ప్రత్యేకంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తుండటంతో ఈ కార్యక్రమంపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సభ(Adipurush Pre Release Event)

ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. దీంతో సభ నిర్వహణ, ప్రాంగణమంతా కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా డిజైన్ చేశారు. కాగా తాజా ఈ ఈవెంట్ కు సంబంధించిన సభ మ్యాపింగ్ ప్లాన్ ని రిలీజ్ చేసింది శ్రేయాస్ మీడియా. ఇది చూసి అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Media (@shreyasgroup)

సభని దీర్ఘ వృత్తాకారంలో డిజైన్ చేశారు. దానిని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి సభకు అయిదు ఎంట్రీలు ఇచ్చారు. నాలుగు భాగాలకు రామాయణంలోని రాజ్యాల పేర్లు అయిన ముందు కిష్కింధ, పంచవటి, మిథిల, అయోధ్య పేర్లు పెట్టారు. అయోధ్య భాగంలో సెలబ్రిటీలు, గెస్టులు కూర్చుంటారు. మిథిల భాగంలో లేడీస్ కి ప్రత్యేకంగా సీటింగ్ ఇచ్చారు. ఇక పంచవటిలో పాస్ లు ఉన్న ఫ్యాన్స్ కి సీటింగ్ ఇచ్చారు. కిష్కింధలో మిగిలిన ఆడియన్స్ కి సీటింగ్ కేటాయించారు. ఇలా సరికొత్తగా డిజైన్ చేసి, వాటికి పేర్లు పెట్టి, వాటికి తగ్గట్టు సీటింగ్ ఇచ్చి చాలా పద్దతిగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండటంతో అందరూ చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు.