Home / Telangana
ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సుజాత జైల్లో ఉండగానే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.
కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఈ విషయంలో కలెక్టర్ కు మద్దతుగా నిలిచారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్‌లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.
టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటినుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు.
తెలంగాణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.