Home / Telangana
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
టీఎస్-ఈసెట్ 2022 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం tsecet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చని మరియు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చని తెలంగాణస్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వెల్లడించింది.
లిక్కర్ స్కాం పై కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
Telanganaగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు.
హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.
చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.
డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఉన్నా ఇంజీనీరింగ్ నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభ వార్తా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.