Last Updated:

Divyavani: బీజేపీలో చేరుతున్న మరో తెలుగు నటి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది.

Divyavani: బీజేపీలో చేరుతున్న మరో తెలుగు నటి

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది. కేవలం ఈటలను మర్యాద పూర్వకంగా కలిశారని దివ్యవాణి అనుచరులు చెపుతున్నారు. ప్రస్తుతం ఈటల తెలంగాణ చేరికల కమిటీకి ఛైర్మెన్ గా ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తన సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడమే కాకుండా, సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత తదితర యాక్టర్లు బీజేపీలో ఉన్నారు. జయసుధ కూడా బీజేపీలో చేరబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఏపీలోనూ తన బలాన్ని పెంచుకోవాలనకుంటోంది బీజేపీ.

దివ్యవాణిని బీజేపీలోకి ఆహ్వానించారని సమాచారం. అదే జరిగితే ఏపీ బీజేపీలో దివ్యవాణి కీలక నేతగా వ్యవహరించే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం మహిళలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వట్లేదని దివ్య వాణి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

follow us

సంబంధిత వార్తలు