Home / Telangana
తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నేతన్నలను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కళా నైపుణ్యానికి వన్నె తెచ్చిన నేతన్నలతోనే గొల్లభామ చీరలకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీకి పెను ప్రమాదం తప్పింది. సజ్జనార్ ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. దానితో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా దసరాను జరుపుకుంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా కనుమరుగవుతుంది.
హైదరాబాదు గాంధీ వైద్యశాల ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ నూతన విగ్రహాన్ని సీఎం కేసిఆర్ అవిష్కరించారు. సమాజాన్ని చీల్చే వ్యక్తుల తీరుతో మహాత్ముని ప్రభ తగ్గదు, మరగుజ్జులు మహాత్ములు కాలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు
దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం మరియు ఆదివారం సెలవు దినం కావడం వల్ల నగరవాసులు ప్రయాణాలు చేపట్టారు. దీనితో హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే, హైదరాబాద్–వరంగల్ రహదారులు వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి పెరిగింది.
ఒకరోజు సెలవు వస్తేనే ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటాం. అసలే దసరా పండుగ అందులోనూ 15 రోజులు సెలవులు. ఇంక ఆగుతామా చెప్పండి. అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఇంటికని కొందరు, పుట్టింటికని మరికొందరు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీగా దర్శనమిస్తుంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని తెలంగాణమంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
రేపటి నుంచి అనగా 2 అక్టోబర్ 2022 నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10న కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.
తెలంగాణకు వచ్చి తిడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.