Dasara Effect: దసరా ఎఫెక్ట్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఒకరోజు సెలవు వస్తేనే ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటాం. అసలే దసరా పండుగ అందులోనూ 15 రోజులు సెలవులు. ఇంక ఆగుతామా చెప్పండి. అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఇంటికని కొందరు, పుట్టింటికని మరికొందరు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీగా దర్శనమిస్తుంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
Dasara Effect: ఒకరోజు సెలవు వస్తేనే ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటాం. అసలే దసరా పండుగ అందులోనూ 15 రోజులు సెలవులు. ఇంక ఆగుతామా చెప్పండి. అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఇంటికని చిన్నారులు, పుట్టింటికని మరికొందరు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీగా దర్శనమిస్తుంది. దాదాపు భాగ్యనగరంలో ఎక్కువశాతం ఆంధ్ర ప్రాంత వాసులు మరియు తెలంగాణలోని వివిధ జిల్లాల వాసులు ఉద్యోగరీత్యానో చదువు కారణంగానో నివాసం ఉంటారు. కాగా ఈ సుదీర్ఘ హాలిడేస్ కారణంగా చాలామంది సొంతూరి బాట పట్టారు. ఈ క్రమంలో రైళ్లు, బస్సులు, కార్లు, అన్నీ ఫుల్ గా ప్రయాణికులతో కనిపిస్తున్నాయి. కాగా భాగ్యనగర సరిహద్దుల్లోని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి దర్శనమిస్తున్నాయి. గంటల కొద్దీ, కిలోమీటర్ల మేర వాహనాలు క్యూకట్టి ఉండడం కనిపిస్తుంది.
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం మరియు ఆదివారం సెలవు దినం కావడం వల్ల శనివారం ఉదయం నుంచే నగరవాసులు ప్రయాణాలు చేపట్టారు. దీనితో హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే, హైదరాబాద్–వరంగల్ రహదారులు వాహనాలతో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి పెరిగింది. రోజుకు సరాసరి 27వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా శనివారం రోజున మరో 5వేల వాహనాలు అదనంగా టోల్ గేటు దాటాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: మాతో పెట్టుకోవద్దు.. వైసీపీ నేతలకు గంగుల కమలాకర్ వార్నింగ్