Home / Telangana
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఐదో విడతలో భైంసా నుండి కరీంనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.
ఇంటగెలిచి రచ్చ గెలవమన్న సామెత ఉంది. దీనిని కేసీఆర్ నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంట గెలిచారు. దీనితో గులాబీ సారు ఇక ఢిల్లీ పై దృష్టి సారించారు.
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని మంత్రులు హరీష్ రావు, దయాకరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం. స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని వారు తెలిపారు
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.