Last Updated:

BRS : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకలు

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

BRS : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకలు

BRS: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ భవన్ లో శుక్రవారం నాడు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈసీ పంపిన పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు.ఈ పత్రాలను ఈసీకి పంపనున్నారు.. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది.

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు.. రాజ‌కీయ పార్టీలు కాద‌న్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాల‌న్నారు. రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని సీఎం స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌న్నారు. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు.

సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో , స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: