Last Updated:

Nagole firing: నాగోల్‌ కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన 15 పోలీసు బృందాలు

హైదరాబాద్ నాగోల్‌ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Nagole firing: నాగోల్‌ కాల్పుల ఘటనపై  రంగంలోకి దిగిన 15 పోలీసు బృందాలు

Nagole firing: హైదరాబాద్ నాగోల్‌ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి మహదేవ్ జ్యువెలర్స్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాల్పులు జరిపి, షాప్‌లోని బంగారం తీసుకుని పారిపోయారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను రంగంలోకి దింపారు.

నాగోల్ ఘటన సీసీ ఫుటేజ్ ను గుర్తించారు పోలీసులు. కాల్పులు జరిపిన తర్వాత రెండు బైక్ లపై పారిపోయారు దుండగులు.సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి. బంగారం షాపులో కాల్పుల్లో ఇద్దరు దుండగులు ఉన్నట్లు తెలుస్తుందని రాచకొండ జాయింట్ కమిషనర్ సుధీర్ బాబు. ఈ కేసులో 15 బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. సిసిటీవీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాన్నారు. కాల్పుల్లో ఇద్దరికి గాయలయ్యాయని..వారి పరిస్థితి నిలకడ ఉందని వెల్లడించారు. ఒకే గన్ తో నాలుగు రౌండ్స్ కాల్పులు జరిగినట్లు గుర్తించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని జాయింట్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు.

ఇదిలా ఉండగా..నాగోల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు బాధితులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. సుప్రజ హాస్పిటల్ కి చేరుకున్న సీపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ చౌదరి, సుఖ్ దేవ్‌ను పరామర్శించారు. ఇద్దరికి సర్జరీ పూర్తి చేసినట్లు సీపీకి వైద్యులు తెలిపారు. జరిగిన కాల్పులు ఘటనపై వివరాలను భాదితుల నుంచి మహేష్ భగవత్ అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి: