Home / Political News
మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.
తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొంత ట్విస్ట్ చోటుచేసుకొనింది. ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను బాగా కుంగతీసింది. గుడ్డిలో మెల్లన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటు శాతం పెరిగింది.
ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.