Last Updated:

Ex Minister Sucharitha: ఆ పదవికి హోంశాఖ మాజీ మంత్రి సుచరిత రాజీనామా..?

ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.

Ex Minister Sucharitha: ఆ పదవికి హోంశాఖ మాజీ మంత్రి సుచరిత రాజీనామా..?

Ex Minister Sucharitha: ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు ఆమె బాధ్యతులు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుచరిత తన మంత్రి పదవిని కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ సుచరితను జగన్ వారించడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఆతర్వాత జరిగిన కీలక సమావేశాలు, పరిణామాల కారణంగా ఆమె గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అయితే తాజాగా ఆమె పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని కూడా ఆమె వెల్లడించారు. ఇకపై తన సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడుకే తాను పరిమితమవుతానని ఆమె తెలిపారు. కాగా సుచరిత ప్రకటనపై వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. సుచరిత నిర్ణయంపై పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం- పవన్ ఫైర్

 

ఇవి కూడా చదవండి: