By Elections: ఉప ఎన్నికల్లో థీటుగా ప్రతిపక్ష పార్టీలు.. భాజపాకు ఇక ఎదురీతే?
ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
New Delhi: ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
ఉత్తర ప్రదేశ్‌లోని గోలా గోకరణ్‌నాథ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీ పై దాదాపు 34,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్ పై ఘన విజయం సాధించారు. బిహార్‌లోని గోపాల్ గంజ్ శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించారు. ఒడిశాలోని ధామ్ నగర్ శాసన సభ స్థానంలో బీజేడీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సూర్యబంషి సూరజ్ తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ కన్నా ముందంజలో ఉన్నారు. 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 6,755 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సూర్యబంషి కనిపించారు.
తెలంగాణాలోని మునుగోడు శాసన సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై దాదాపు 11666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బిహర్‌లోని మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి పై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మహారాష్ట్రలోని తూర్పు అంధేరీ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Munugode By Poll Result 2022 Live: మునుగోడులో విజయకేతనం ఎగురవేసిన తెరాస