Home / Political News
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పేరును పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూనివర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ గురువారం ప్రమాణస్వీకారం చేసారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన మరోసారి జగన్ సర్కార్‌పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.
1991 సంస్కరణలను "హాఫ్ బేక్డ్ " అంటూ కొన్ని వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బుధవారం విరుచుకుపడింది. "మాస్టర్ చెఫ్" నితిన్ గడ్కరీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పొగడటం ద్వారా దానిని పూర్తిగా తయారు చేసారని అంది.