Home / national news
ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
తమిళనాడులో రైలు ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు వద్ద అర్ధరాత్రి చోటుచేసుకొన్న ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
డబ్బు ముఖ్యం కాదు ఆనందంగా ఉంటూ ఎదుటివారిని సంతోషపెట్టడమే మానవ జీవిత పరమార్ధం. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు.
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది,
గోవా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆనందంగా గడిపేలా చూసేందుకు, గోవా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యకలాపాలను చట్టవిరుద్ధమని పేర్కొంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్ కు గురువారం అనుకోని అతిథి వచ్చారు. స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ రెస్టారెంట్‌ని సందర్శించి వారి ప్రసిద్ధ వంటకాలైన మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీని ప్రయత్నించారు. ఈ విషయాన్ని విద్యార్థి భవన్ వారు నెట్టింట పోస్ట్ చేసి వెల్లడించారు.
స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకుని స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలాంటి శ్యామ్ శరణ్ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.