Last Updated:

Puneeth Raj Kumar: “అప్పు” కు దక్కిన అరుదైన గౌరవం.. ఆ శాటిలైట్ పేరు పునీత్

కన్నడ పవర్ స్టార్‌, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్‌-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్‌ పునీత్‌’ అని పేరు పెట్టారు.

Puneeth Raj Kumar: “అప్పు” కు దక్కిన అరుదైన గౌరవం.. ఆ శాటిలైట్ పేరు పునీత్

Puneeth Raj Kumar: ఇటీవల కాలంలో జిమ్ చేస్తూ ఆకస్మికంగా పునీత్ మరణించడాన్ని ఆయన కుటుంబీకులే కాకుండా కన్నడ ప్రజలు సైతం జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అప్పు లేడన్న వార్తను మరువలేకుండా ఉన్నారు. ఆయన సినిమాల్లోనే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ విశేష ప్రజాదరణను సొంతం చేసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్‌, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం పునీత్ ను కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో అరుదైన గౌరవం పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్‌-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్‌ పునీత్‌’ అని పేరు పెట్టారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దాదాపు 75 ఉపగ్రహాలను రూపొందించారు.  కాగా ఈ  75 ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కర్ణాటక విద్యార్థులు రూపొందించిన ఈ శాటిలైట్‌ను ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్‌ దావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహకనౌక ద్వారా క్షక్షలోకి  పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ శాటిలైట్ కు పునీత్ అని నామకరణం చెయ్యడం విశేషం.

ఇదీ చదవండి: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ సంచల కామెంట్స్

ఇవి కూడా చదవండి: