Home / national news
తమిళనాడులో ఇటీవలె కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంటర్ విద్యార్థిని టాయిలెట్లో శవమై కనిపించింది. ఈ ఘటనతో ప్రస్తుతం తమళనాట తీవ్ర విషాదం నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు.
బ్రిటీష్ వలస రాజ్యాల గతాన్ని ఆర్మీ తుడిచేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతీయ వారసత్వానికి దేశ సైనిక వ్యవస్ధకు సరికొత్త బీజం వేయనుంది. భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో నేడు ఆచరిస్తున్న ఆర్మీ బ్రిటీష్ వలస గతానికి చరమగీతం పాడనున్నారు.
హోండా యాక్టివా, హీరోహోండా బైక్‌లు తెలియని భారతీయులు ఉండరు. సామాన్యుల బడ్జెట్‌కు అనుగుణంగా లభించే ఈ టూవీలర్లు తయారీ చేసి హోండా మోటార్ సైకిల్స్ సంస్థ ఆటోమొబైల్ రంగంలో దిగ్విజయంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగినట్టుగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగింది. మోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో మార్కెట్లో లాంఛ్ చెయ్యనుంది.
రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఒక్కసారిగా ఓ ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో జరిగింది.
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగు వెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.
టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అక్రమ కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో నగదు సంపాదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్‌లో కాశ్మీర్ మొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ థియేటర్ చైన్ ఐనాక్స్ సహకారంతో, బాదామి బాగ్ కంటోన్మెంట్ సమీపంలోని శివపోరా వద్ద మల్టీప్లెక్స్ మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లను కలిగి ఉంది.
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు