Home / national news
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తి ఆయన.
ఉత్తరప్రదేశ్‌లో ఆవుల ఆక్రమరవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM-GKAY) పథకాన్ని డిసెంబర్ 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా రెండు రౌండ్ల దాడులు మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ) కు చెందిన 240 మంది సభ్యులని అరెస్టు చేసిన తరువాత కేంద్రం తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణల పై ఐదేళ్ల పాటు పిఎఫ్ఐ ను నిషేధించింది.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ ఒకదానికి ఒకటి ఢీ కొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు.
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.
కొద్ది రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వారితో విందు. నేడు పారిశుద్ధ కార్మికుడి కుటుంబానికి తన ఇంట విందు. విజన్ వున్న నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వార్తలతో ప్రజా నేతగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు.